![దేవతామూర్తుల కోసం ఆందోళన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07knp155-340107_mr-1738955859-0.jpg.webp?itok=RFEvQosy)
దేవతామూర్తుల కోసం ఆందోళన
● వదంతులతో ఇరు గ్రామల మధ్య గొడవ ● పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం దిల్దార్‌నగర్, ఎలగడప, సారంగాపూర్ గ్రామాల సమీపంలోని పురాతన అక్కకొండ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులను సంప్రదాయం ప్రకారం మండలంలో ఎలగడప గ్రామం నుంచి ఊరేగింపుగా అక్కకొండ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి తీసుకొస్తారు. తెల్లవారితే ఊరేగించే ఉత్సవ మూర్తులు శుక్రవారం కనిపించలేదు. దీంతో సారంగాపూర్ గ్రామస్తులు ఎత్తుకెళ్లారని శుక్రవారం రాత్రి పుకార్లు వ్యాపించడంతో ఎలగడప గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్నా ఎస్సై ఎం.కృష్ణసాగర్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ఉత్సవ మూర్తులను ఆలయ పూజరులే తీసుకెళ్లారని గ్రామస్తులకు తెలుపడంతో అందోళన సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment