బూర్గుడ హెచ్‌ఎంపై విచారణ
ఆసిఫాబాద్: మండలంలోని బూర్గుడ హెచ్‌ఎం శ్యాంసుందర్‌పై బుధవారం శాఖాపరమైన విచారణ చేపట్టారు. టీయూటీఎఫ్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఆర్‌జేడీకి ఫిర్యాదు చేయగా.. ఏడీ గమానియల్ పాఠశాలలో విచారణ చేపట్టారు. జూన్‌లో నిర్వహించిన పదోతరగతి అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో విధులు నిర్వర్తించిన ఇన్విజిలేటర్లకు డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధించడం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణకు గైర్హాజరవడం, స్కూల్ అసిస్టెంట్ పెండ్యాల సదాశివ్‌కు సీసీఎల్‌ఎఫ్ మంజూరు చేయకపోవడంతోపాటు పలు అంశాల్లో నిబంధనలు అతిక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే పలువురు ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో ఫిర్యాదు చేశారు.
ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ
నిర్మల్‌టౌన్: సరుకు రవాణాలోనూ ఆర్టీసీ తన వాటా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఖర్చులకు తగినట్లు అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. విస్తృత నెట్‌వర్క్ కలిగిన ఆర్టీసీ ఇప్పటికే కార్గో సేవల ద్వారా మంచి ఆదాయం పొందుతోంది. ఆ రంగంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హోమ్ డెలివరీకి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని వివేక్‌నగర్, గంగా కాంప్లెక్స్, నారాయణరెడ్డి మార్కెట్ ప్రాంతంలోని ప్రజలకు ఆదిలాబాద్ రీజియన్ కార్గో మేనేజర్ బి.పాల్ ఆధ్వర్యంలో హోమ్ డెలివరీ సేవలపై బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment