‘గ్యారంటీలు అమలు చేయాలి’
పాతమంచిర్యాల: ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలు అమలు చేయాలని ధర్మసమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పేద, మధ్య తరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలు ఉన్నారని, విద్య, వైద్యం, ఉ పాధి, భూమి, ఇళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నార ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ నాయకులు జంగపెల్లి రామస్వామి, నందిపాటి రాజు, తాళ్లపల్లి చంద్రశేఖర్, ఈ దునూరి రమేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
26న సంయుక్త కిసాన్ మోర్చా నిరసన
పాతమంచిర్యాల: ఈ నెల 26న జిల్లా కేంద్రం మంచిర్యాలలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ.లాల్‌కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్‌లో జాతీయ కార్మిక సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీపీఐ పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి మేకల రామన్న, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్, నాయకుడు చంద్రయ్య, ఏఐకేఎంఎస్ నాయకులు తిరుపతి, గణేష్ పాల్గొన్నారు.
మాల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ నియామకం
పాతమంచిర్యాల: మాల సంఘం, మాల ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా కన్వీనర్‌గా పట్టణానికి చెందిన తొగరు సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గజెళ్లి లక్ష్మణ్ తెలిపారు. 20 మందిని జిల్లా కో కన్వీనర్లుగా నియామకం చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలలందరినీ ఐక్యం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డిసెంబర్ ఒకటిన జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment