‘రాజ్యాంగాన్ని కాలరాస్తున్న ప్రభుత్వం’
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోందని, రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో దళిత, గిరిజనులు అణిచివేతకు గురవుతున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు, నిర్బంధాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద దళిత, గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కుని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, గోగుల రవీందర్‌రెడ్డి, శ్రీరాముల మల్లేశ్, సుంకరి రమేశ్, తోట తిరుపతి, శ్రీపతి శ్రీనివాస్, ఎడ్ల శంకర్, పడాల శ్రీనివాస్, కార్ల తిరుపతి, పెంట ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment