బాసర అమ్మవారికి రూ.2.50కోట్ల ఆదాయం
భైంసా: బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఏ డాది కాల వ్యవధితో దుకాణాలు, ఇతర సామగ్రి వి క్రయించేందుకు మంగళవారం నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ పర్యవేక్షణలో బహిరంగ వేలం నిర్వహించారు. అమ్మవారికి వేలం ద్వారా రూ.2కోట్ల 55లక్షల 80వేల ఆదాయం సమకూరింది. పూజ సామగ్రి, అమ్మవారి చీరెల విక్రయం, ఫొ టోలు తీయడం, పాదరక్షలు భద్రపరచడంతోపా టు ఆలయ ప్రాంగణంలోని పలు దుకాణాల నిర్వహణకు వేలం వేశారు. అత్యధికంగా బిడ్డింగ్‌వేసిన వారికి వీటిని అప్పగించారు. అమ్మవారి చీరెలు విక్రయించుకునేందుకు రూ.76,26,006, పూజా సామగ్రి సేల్స్ కౌంటర్‌కు రూ.38.75లక్షలు, రూ.1,000 మండపంలో ఫొటోలు తీసేందుకు రూ.38.00లక్షలు, రూ.150 అక్షరాభ్యాస మండపంలో ఫొటోలు తీసేందుకు రూ.41.67లక్షలు, వ్యాసమందిరం వద్ద కూల్ డ్రింక్స్ విక్రయించేందుకు రూ.8.54లక్షలు, పాదరక్షలకు రూ.2.70లక్షలు, వ్యాస మహర్షి వద్ద పూజా సామగ్రి విక్రయించేందుకు రూ.3.85లక్షలు, లక్ష్మీ సదనం వెనుక షాప్ నంబర్–3కి రూ.1.25లక్షలు, లక్ష్మీ సదనం వెనుక షాప్ నంబర్–7కు రూ.27వేలు, లక్ష్మీసదనం వెనుక షాప్ నంబర్–9కి రూ.31వేలతో పలువురు బహిరంగవేలంలో దక్కించుకున్నారు. ఆలయ ఈవో నవీన్‌కుమార్, ఏఈవో సుదర్శన్‌గౌడ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment