చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల కలయికతో ఉందని, చెన్నూర్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి కోరారు. మంగళవారం అంసెబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్టీసీ డిపో ఏర్పాటు, రోడ్లు నిర్మాణం అయిన గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి ప్రభాకర్ స్పందిస్తూ చెన్నూర్ ఆర్టీసీ డిపోకు రూ.4 కోట్లు మంజూరు చేశామని, డిపో కాంపౌండ్ వాల్, బేస్‌మెంటు, గ్యారేజీ పనులు పూర్తయ్యాయని, భూమి విషయంలో కోర్టు స్టే ఉండడంతో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని తెలిపారు. స్టే ఎత్తివేయగానే డిపో నిర్మాణం పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment