కవ్వాల్ అందాలు కనువిందు
జన్నారం: ప్రకృతిలో ప్రతీ వస్తువు కనువిందు చేస్తుంది. మనస్సు పెట్టి చూస్తే ఎన్నో అందాలు మనస్సుకు హత్తుకుంటాయి. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్ బైసన్‌కుంటలో అటవీ అందాలను ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ నవీన్ కెమెరాలో బంధించారు. ఈ చిత్రాలు చూపరులను కనువిందు చేశాయి.
అరుదైన షటిల్ కాక్ మష్రూమ్
కడెం: కవ్వాల్ టైగర్ జోన్‌లోని కడెం అడవుల్లో అరుదైన షటిల్‌కాక్ మష్రూమ్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ(హైటీకాస్) ఉత్తర తెలంగాణ రీజియన్ రీజనల్ కోఆర్డినేటర్ వెంకటేష్ అనగంధుల మంగళవారం గుర్తించారు. కడెం అటవీ రేంజ్ పరిధిలోని గంగాపూర్ ప్రాంతంలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment