కామన్ డైట్ మెనూ ఇబ్బందులపై వినతి
మంచిర్యాలఅగ్రికల్చరల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో కామన్‌డైట్ మెనూ అ మలులో ఎదురవుతున్న ఇబ్బందులపై టీఎ న్జీవోస్, టీహెచ్‌డబ్ల్యూఎస్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. వసతిగృహాల్లో వివిధ రకాల అప్రూవల్ డిస్ట్రిక్ పర్చేస్ కమిటీ(డీపీసీ) రేట్లు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కామన్‌డైట్ మెనూ సాధ్యం కాదని వివరించారు. ఇదివరకు గురుకులాలు, వసతిగృహాల్లో వేర్వేరు మెనూ ఉండేదని తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గ డియారం శ్రీహరి, టీహెచ్‌డబ్ల్యూఎస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోసిన్ ఆహ్మద్, కార్యదర్శి శ్రీనివాస్, టీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, మహిళా ఉపాధ్యక్షురాలు కేజీయారాణి, సంయుక్త కార్యదర్శి సునతీ, వసతిగృహ సంక్షేమాధికారులు ధర్మనంద్‌గౌడ్, కిషోర్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment