విడిపోయిన గూడ్స్ రైలు బోగీలు
తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లేవాడ–రేచినీ రోడ్ రైల్వేస్టేషన్ మధ్య మంగళవారం ఓ గూడ్స్‌రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. సిర్పూర్ కాగజ్‌నగర్ వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు బోగీలు సరిగ్గా కొత్తపల్లి వారసంత సమీపంలో విడిపోయాయి. రైలు ఇంజిన్‌తోపాటు కొన్ని బోగీలు, విడిపోయిన బోగీలు కొద్ది దూరం వరకు వెళ్లాయి. ఈ క్రమంలో మరేదైన రైలు వచ్చి ఉంటే ప్రమాదం జరిగేదని రైల్వే సిబ్బంది హడలిపోయారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు గూడ్స్ రైలును నిలిపి వేసి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. రైలు ఇంజిన్‌కు అనుసంధానంగా ఉన్న బోగీలకు విడిపోయిన బోగీల లింక్‌ను కలిపి అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక గూడ్స్ రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ పరిణామంతో రైల్వే అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment