బిల్లులు చెల్లించకుంటే వంట పనులు బంద్
దండేపల్లి: నాలుగు నెలల పెండింగ్ బిల్లులు, ఏడాదిగా నిలిచిపోయిన కోడిగుడ్ల బిల్లులు, గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభు త్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట పని కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు న్యాలం శ్రీదేవి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంతోపాటు పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఈ నెల 24 నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంట పనులు నిలిపివేసి రోజువారీ నిరసనలు చేపడుతామని తెలిపా రు. బిల్లుల పెండింగ్‌పై దండేపల్లి ఎమ్మార్సీ కార్యాలయం వద్ద మండలంలోని పలు పాఠశాలల మధ్యాహ్న భోజన వంట పని కార్మికులు మంగళవారం ఆందోళన చేశారు. మండల అధ్యక్షురాలు గడికొప్పుల మల్లేశ్వరి, సభ్యులు శంకరమ్మ, శ్యామల, లత, సరోజ, జమున, గంగమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment