లెక్కల మా‘స్టార్’
మంచిర్యాలఅర్బన్: తాండూర్ మండలం కాసిపేట ఎంపీయూపీఎస్ గణిత ఉపాధ్యాయుడు గంప శ్రీనివాస్ విద్యార్థులకు కొత్త తరహా గణిత బోధనకు ప్రత్యేక కిట్ రూపొందించారు. గణితంపై సామర్థ్యాలు మెరుగుపరుస్తూనే ఎఫ్‌ఎల్‌ఎన్–లిప్ గణిత ఐఎల్‌ఎం కిట్ ప్రదర్శనతో నాలుగుసార్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆరేళ్లుగా కాసిపేట స్కూల్లో బోధన చేస్తున్నారు. గణితంలో విద్యార్థుల భయాన్ని దూరం చేసేందుకు మూడేళ్ల క్రితం విడివిడి తయారు చేసిన పరికరాలతో వినూత్నంగా బోధించేవారు. విద్యార్థులకు చదువులో సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్(ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ) అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని పరికరాలు కలిపి ప్రత్యేక గణిత కిట్‌తో బోధన చేస్తున్నారు. ప్రతీ ఏడాది రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్‌ఫెయిర్‌లో నవంబర్ 31, డిసెంబర్ 2024లో నిర్వహించిన పోటీల్లో టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం) శ్రీనివాస్ ప్రదర్శించిన ఎఫ్‌ఎల్‌ఎన్–లిప్ మ్యాథమాటికల్ ఐఎల్‌ఎం కిట్ రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. 2022–23 విద్యాసంవత్సరంలో కేరళలో నిర్వహించిన ప్రదర్శనలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఒకటో తరగతికి చెందిన నంబరు లెక్కింపు మొదలుకుని 10వ తరగతికి చెందిన త్రికోణమితికి చెందిన టీఎల్‌ఎం ఈ కిట్‌లో ఉన్నాయి. ప్రతీ ప్రాఠశాలలో ఈ కిట్ అందుబాటులో ఉంటే విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంపొందించవచ్చని ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment