ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల వంటావార్పు
మంచిర్యాలఅగ్రికల్చర్: సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 12 రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్‌ఏ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుమలత, రాజన్న మాట్లడుతూ ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చలకు పిలిచి న్యాయం చేయాలని అన్నారు. 20 ఏళ్లుగా విద్యాశాఖలో కీలకంగా పని చేస్తున్నామని తెలిపారు.
సంఘాల సంఘీభావం
సమ్మెకు పలు సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు గడియా రం శ్రీహరి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయమైన డి మాండ్లు పరిష్కరించాలని, రాష్ట్ర కమిటీ అండగా ఉంటుందని తెలిపారు. నాయకులు పొన్న మల్ల య్య, నాగేందర్, తిరుపతి సంఘీభావం తెలిపారు. బెల్లంపల్లి మండలం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు మహేశ్వరెడ్డి, దామోదర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, సీఐ టియూ జిల్లా నాయకులు రంజిత్, జిల్లా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎండీ.అజీజ్, విష్ణువర్థన్, సత్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment