పండుగలు సమష్టిగా జరుపుకోవాలి
మంచిర్యాలటౌన్: ప్రజలంతా ప్రతీ పండుగను సమష్టిగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో కలెక్టర్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కులమతభేదాలు లే కుండా ప్రతీ పండుగను అందరూ కలిసి వేడుకగా జరుపుకోవడం కోసం ప్రభుత్వం కృషి చే స్తోందని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉ న్న వారు కూడా పండుగను జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ నెల 25న క్రిస్మస్ వేడుకలను ప్రజలు సంతో షంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, మంచిర్యాల తహసీల్దార్ రఫతుల్లా, పాస్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment