చోరీకి యత్నించిన స్థల పరిశీలన
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని రామాయిలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 13న చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. ఎస్పీ గౌస్ ఆలం శనివారం సంఘటన స్థలాన్ని పరిశీ లించారు. బ్యాంకులోని నగదు, ఇతర వ స్తువుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను బ్యాంకు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. చోరీకి య త్నించిన సమయంలో అక్కడ మోగిన సైరన్, ఇతర వాటిని పరిశీలించారు. సీసీ ఫుటేజీలను సేకరించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై ముజాహిద్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పీ.చంద్రశేఖర్, సీసీఎస్ పోలీసులు, బ్యాంకు ఉద్యోగులు, తదితరులు ఉన్నారు.
అన్యమత ప్రచారం అడ్డుకున్న యువకులు
భీమిని: మండలంలోని బిట్టురుపల్లిలో శుక్రవారం రాత్రి అన్యమత ప్రచారం చేస్తున్న పలువురిని గ్రామ యువకులు అడ్డుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కొంక సత్యనారాయణకు సమాచారం అందివ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకుని వారికి డబ్బులు ఎరజూపి అన్యమతంలోకి మారుస్తున్నారన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మందమర్రిరూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలలోని చున్నంబట్టి వాడకు చెందిన మహాత్మ సంతోష్ (35) పని నిమిత్తం మేడారం వచ్చాడు. శనివారం రోడ్డు దాటుతుండగా మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహన చోదకుడికి సైతం తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment