● ఆగని మృగాళ్ల అఘాయిత్యాలు ● కఠిన చట్టాలున్నా మారని కామాంధుల తీరు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పోక్సో కేసులు ● ఠాణాకు రాని సంఘటనలు అనేకం.. ● అప్రమత్తత, అవగాహన అవసరమంటున్న నిపుణులు | - | Sakshi
Sakshi News home page

● ఆగని మృగాళ్ల అఘాయిత్యాలు ● కఠిన చట్టాలున్నా మారని కామాంధుల తీరు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పోక్సో కేసులు ● ఠాణాకు రాని సంఘటనలు అనేకం.. ● అప్రమత్తత, అవగాహన అవసరమంటున్న నిపుణులు

Published Mon, Dec 23 2024 12:11 AM | Last Updated on Mon, Dec 23 2024 12:11 AM

-

మంచిర్యాలక్రైం: గంజాయి, మద్యం మత్తులో కా మాంధులు వావి వరసలు మర్చిపోతున్నారు. పిల్ల లు, వృద్ధులు అని కూడా చూడకుండా పైశాచికానికి ఒడిగడుతున్నారు. ఆడది అయితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బాలికలు, మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. కామాంధుల తీరు మారడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా, చాలామంది పంచాయితీలు, జరిమానాలతో బయటకు రాకుండా చేస్తున్నారు.

బయటకు రాని ఘటనలెన్నో...

ఉమ్మడి జిల్లాలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. వీటిలో కొన్ని వెంటనే వెలుగులోకి వస్తుండగా... మరికొన్ని ఇతర కేసుల విచారణ సమయంలోనో.. లేక బాఽధితులు అనారోగ్యానికి గురైనప్పుడో వెలుగుచూస్తున్నాయి. ఇక పరువు పోతుందన్న భయంతో కొందరు తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనలను దాచిపెడుతున్నారు. నిందితులు తెలిసిన వారై ఉండటం, పోలీసుల దృష్టికి తీసుకెళితే బయటకు వచ్చాక మళ్లీ వేధిస్తారన్న భయంతో చాలా మంది ఫిర్యాదు చేయడం లేదు. ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన చిరు వ్యాపారి కూతురును తన దగ్గరి బంధువే ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని దాచి ఉంచారు.

తల్లిదండ్రుల బాధ్యత...

ఎవరైనా ప్రేమగా మాట్లాడినా, ఆటలు ఆడినా.. చి న్నారులు వారి దగ్గరకు వెళ్తారు. అందరూ మంచి వారే.. అందరూ మనవారే అన్న భావనలో ఉంటా రు. అయితే మంచితనం ముసుగులో కొందరు పిల్ల లపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. చుట్టూ ఉన్నవారు.. బంధువులు.. బాగా తెలిసినవారే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతీ సందర్భంలో పిల్లలను కనిపెట్టుకుని ఉండడం సాధ్యం కాదు. పిల్లలకు వారి శరీరంలో మార్పులను బట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో జాగ్రత్తలు వహించాలని వైద్యులు, పోలీసులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వస్తే గమనించి, కారణాలను తెలుసుకోవా లంటున్నారు. ఇంట్లో మగ పిల్లలు అయితే తోటి పి ల్లలతో, ముఖ్యంగా తమ చుట్టూ ఉన్న మహిళలు, బాలికలను ఏవిధంగా గౌరవించాలో నేర్పించాల ని.. బాలికలకై తే తమ శరీరాన్ని ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలో నేర్పించాలని పేర్కొంటున్నారు. గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించాలంటున్నారు. పిల్లలతో సమయం గడుపుతూ వారు చెప్పే విషయాలను స్నేహితులుగా వినాలని సూచిస్తున్నారు. పోలీస్‌, న్యాయశాఖ ద్వారా బాలికల భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.

మైనర్లను లైంగికంగా వేధిస్తే..

లైంగికదాడుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో ఆమోదం లభించింది. ఆ ఏడాది జూన్‌ 19న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జూన్‌ 20న గెజిట్‌లో నోటిఫై చేశారు. చట్టంలో పేర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలపక పోయినా 18 ఏళ్లలోపు బాలికలపై లైంగికదాడి జరిగితే అది నేరంగానే పరిగణించబడుతుంది. 16 ఏళ్లలోపు బాలిక ఆమోదం తెలిపినా, తెలుపకపోయినా లైంగికదాడిగానే పరిగణిస్తారు. కొత్త చట్టం, నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు ఉన్న ఏ వ్యక్తికై నా ఇది వర్తిస్తుంది. నేరం రుజువైతే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేదా జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. పిల్లలపై లైంగిక వేధింపులు, దాడి చేస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా, రెండోసారి అదే నేరం చేస్తే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో జీవిత ఖైదు శిక్షపడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement