సీఎం కప్‌లో నీల్వాయి విద్యార్థుల ప్రతిభ
వేమనపల్లి: సీఎం కప్ జిల్లాస్థాయి పోటీల్లో వే మనపల్లి మండలం నీల్వాయి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు 29 పతకాలు సాధించి జిల్లాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఖో ఖోలో జిల్లాస్థాయి టీమ్ చాంపియన్‌గా బాలి కల జట్టు నిలిచింది. సబ్ జూనియర్‌లో వశాక రజిత ట్రై అత్లిన్ ద్వితీయ స్థానం, నికాడి వేణు ట్రై అత్లిన్ తృతీయ స్థానం, దినేష్ జావెలిన్‌త్రోలో తృతీయ స్థానం, జూనియర్‌లో బతుకక్క 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం, చెండే కృష్ణవేణి 3 వేల మీటర్ల పరుగులో ప్రథమ స్థానం, అజయ్ లాంగ్‌జంప్ ద్వితీ య స్థానం, సీనియర్స్‌లో భానుమతి షాట్‌పుట్, లాంగ్‌జంప్‌లో ప్రథమ, టకిరె కృష్ణవేణి 100 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ, టకిరె శ్రీలత లాంగ్‌జంప్‌లో తృతీయ స్థానం, చెండే మౌనిక ద్వితీయ స్థానం, ముద్దం పవన్ 400 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం, ముద్దం శ్రావణ్ 100, 400 మీటర్లు పరుగు పోటీలో తృతీయ స్థానం దక్కించుకున్నారు. వీరిని ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీ దాసరి మల్లేశ్, మండల మాజీ జెడ్పీటీసీ సంతోష్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, తహశీల్దార్ రమేశ్, ఎంఈవో శ్రీధర్‌రెడ్డి, ఎస్సై శ్యాంపటేల్, హెచ్‌ఎం గిరిధర్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment