పదేళ్ల జైలు శిక్ష...
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామరావుపేట గ్రామానికి చెందిన బాలికపై 2021, ఫిబ్రవరి 9న అదే గ్రామానికి చెందిన కామెర రఘు(24) లైంగిక దాడిచేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘుపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో 2023, ఆగస్టు 4న అప్పటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు రఘుకు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.7 వేలు జరిమానా విధించారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఈ ఏడాది డిసెంబర్ 21న ఓ యువకుడు మద్యం మత్తులో 12 ఏళ్ల బాలికను మూడు గంటలపాటు నిర్బంధించాడు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన చట్ల పోశెట్టి(25) మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలనీకి చెందిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు. అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. అతడిని అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం నిందితుడి ఇంటిని దహనం చేశారు. కాగా, నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment