నేడు సింగరేణి డే
● శ్రీరాంపూర్, మందమర్రిలో వేడుకలు
శ్రీరాంపూర్: సింగరేణి ఆవిర్భావ వేడుకలు శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో సోమవారం జరుగనున్నాయి. ఏటా నిర్వహిస్తున్నట్లుగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. మైదానంలో వేధి కను సుందరంగా తీర్చిదిద్దారు. మైదానంలో చుట్ట్టూ హైమాస్ట్ లైట్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు ఏ ర్పాటు చేశారు. చలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రే క్షకుల గ్యాలరీలకు సమీపంలో క్యాంప్‌ఫైర్‌ను ఏర్పా టు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఈ వేడుకలను జీఎం ఎల్వీ సూర్యనారాయణ, సేవా అధ్యక్షురాలు మాలతీ ప్రారంభిస్తారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్టాల్స్‌ను ప్రారంభిస్తారు. కంపెనీ ఔనత్యాన్ని తెలిపే స్టాల్స్, ఫుడ్‌స్టాల్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్తమ ఉద్యోగులకు, అధికా రులకు, సేవా సభ్యులకు ఈ సందర్భంగా బహుమతి ప్రదానం చేయనున్నా రు. వేడుకల కోసం చేస్తున్న ఏర్పాట్లను జీఎం సూ ర్యనారాయణ, ఇతర ముఖ్య అధికారులు ఆదివా రం పరిశీలించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఈ ప్రాంత ప్రజలు హాజరై వేడుకలను తిలకించాలని కోరారు.
సింగరేణి హైస్కూల్ మైదానంలో..
మందమర్రిరూరల్: సింగరేణి డే వేడుకలను మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో సోమవారం నిర్వహించనున్నారు. ఈమేరకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లను ఏరియా జీఎం దేవేందర్ ఆదివారం పర్యవేక్షించారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్టాల్స్ ప్రారంభోత్సవం ఉంటుందని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
గణితంలో విద్యార్థి ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: రాష్ట్ర గణిత ఫోరం రామానుజన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత ప్రతిభ పరీక్ష–2024లో మంచిర్యాల మోడల్ స్కూల్ విద్యార్థి నల్లచరణ్ ప్రతిభ కనబర్చాడు. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. సత్తా చాటిన చరణ్‌ను ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న, గణిత ఉపాధ్యాయులు హరీష్, శ్రీలత అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment