బాలసాహిత్యానికి ప్రాముఖ్యత
మంచిర్యాలఅర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలసాహిత్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని, కవులు, రచయితలు బాలసాహిత్యంపై దృష్టి సారించా లని విశ్రాంత తెలుగు పండితుడు చినరామాకిష్ట య్య అన్నారు. స్థానిక సరస్వతీ శిశుమందిర్‌లో జి ల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆది వారం డిసెంబర్ మాస రెండో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందరిలో పుస్తక పఠనం కరువైందని, టీవీ సెల్‌ఫోన్, యూట్యూబ్‌కే అంకితమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు సైతం సెల్‌ఫోన్లకే నిమగ్నమవుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలని సూచించారు. ఉపాధ్యాయుడిగా చిన్న పిల్లలకు కథలు చెబుతూ, ఉన్న కథలు చెబుతూనే తాను స్వయంగా కథలు రాసి బోధిస్తూ 720 కథలు, 100 లలిత గీతాలు రాశానని వివరించారు. కవులు ముత్యబోయిన మలయశ్రీ, రామేశంగౌడ్, వెంకట్రాయశర్మ, చంద్రశేఖర్, సుగుణాకర్, సంతోష్, మురళీకృష్ణ, శ్రీనాథ్‌గౌడ్ కవితాగానం చే శారు. సమితి పక్షాన సభ్యులు ప్రసంగ కర్తను సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వామన్‌రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment