పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే...
పిల్లల బాధ్యత తల్లి దండ్రులదే. వారి కదలికలు, దిన చర్యలో వారు ఏం చేస్తున్నా రు.. ఎక్కడికి వెళ్తున్నారు. వారి స్నేహితుల వివరాలు తల్లిదండ్రులకు తెలిసి ఉండా లి. ఎవరితో కూడా చనువుగా ఉండకుండా చూసుకోవాలి. సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించాలి. పోలీ సులు ఎప్పుడూ అండగా ఉంటారు. ఎవరైనా వేధించినా, ఇబ్బందులకు గురిచేస్తే రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీం ఉంది. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారు. – ఎం.శ్రీనివాస్,
రామగుండం పోలీస్ కమిషనర్
బాధ్యతగా వ్యవహరించాలి...
బాలికలపై జరుగుతు న్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రతీ పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు బాలికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బాలికలపై లైంగిక దాడులు జరిగినప్పుడు ఫిర్యాదుకు వెనుకాడుతున్నారు. నిందితులకు భయపడి కొందరు ఫిర్యాదు చేయడం లేదు. కొందరు రాజీ పడుతున్నారు. దీంతో నేరస్తులు తప్పించుకుంటున్నారు. తప్పుచేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయి. లైంగికదాడికి గురైన బాలికకు ప్రభుత్వం పరిహారం సైతం అందిస్తుంది.
– రాంబావ్, పోక్సో కోర్టు పబ్లిక్
ప్రాసిక్యూటర్, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment