27న ఉమ్మడి జిల్లా సైక్లింగ్ క్రీడాకారుల ఎంపిక
బెల్లంపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–19 విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి స్లైకింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనె ల 27న నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 సెక్రెటరీ బి.బాబురావు తెలిపారు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈపోటీలకు ఇంటర్ చదువుతూ 19 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాల బాలికలు అర్హులని తెలిపారు. పోటీల్లో పా ల్గొనే క్రీడాకారులు ఉదయం 7 గంటల వరకు హా జరు కావాలని సూచించారు. వివరాల కోసం 984 9922445 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలి
నస్పూర్: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సొంతింటి కల నెరవేర్చాలని సీఐటీ యూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డి మాండ్ చేశారు. ఆర్‌కే 5 గనిపై మంగళవారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ అనివార్య కారణాలతో విధులకు గైర్హాజరైన కార్మికులను మెడికల్ చెకప్‌కు పంపించడం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి కంపె నీకి రావల్సిన రూ.33వేల కోట్ల పైచిలుకు బ కాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో గని పిట్ సెక్రెటరీ చిగురు లక్ష్మణ్, బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంగల శ్రీనివాస్, ట్రెజరర్ కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంకట్‌రెడ్డి, సదానందం, సురేందర్, సురేష్, శ్రీనివాస్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment