ప్రపంచ తెలుగు మహాసభలకు చెన్నూర్ కవులు
చెన్నూర్: విజయవాడలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు చెన్నూర్‌కు చెందిన కవులు బొడ్డు మహేందర్, మేకల రామస్వామి, దబ్బెట రాజమల్లుకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందడం సంతోషంగా ఉందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ సాహిత్య గొంతుకను ప్రపంచ వేదికపై విన్పించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరగనున్న మహాసభల్లో పాల్గొని జిల్లా కీర్తిని ఇనుమడింపజేస్తామని తెలిపారు.
ఆశ్రమ పాఠశాలలో ఏటీడీవో విచారణ
కోటపల్లి: కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఘటనపై సోమవారం ‘సాక్షి’లో ‘డౌట్ అడిగినందుకు చితకబాదిన టీచర్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా ట్రైబల్ వె ల్ఫేర్ అధికారులు స్పందించారు. మంగళవారం కో టపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఏటీడీవో పురుషోత్తం సందర్శించి విద్యార్థులను అడిగి పాఠశాల పరిస్థితులు, ఉపాధ్యాయుల పనితీరు, మోనూపై ఆరా తీసినట్లు సమాచారం. ఇదే విషయంపై ఏటీడీవో పురుషోత్తంను సంప్రదించగా పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment