● అదనపు కలెక్టర్ మోతిలాల్
మంచిర్యాలఅగ్రికల్చర్: డిజిటల్ విధానం, పర్చువ ల్ విచారణల ద్వారా వినియోగదారులకు సమగ్ర న్యాయం జరుగుతుందని అదనపు కలెక్టర్ మోతిలా ల్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. విని యోగదారుల డిజిటల్ విధానం వర్చువల్ విచారణ ద్వా రా సమగ్ర న్యాయం పొందవచ్చని, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో సాంకేతిక అవశ్యకత, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వినియోగదారుల హక్కులపై అవగాహన, సంబంధిత అంశాలకు మరింత అందుబాటులో ఉండేలా చేపట్టాల్సిన చర్యలు వివరించారు. వినియోగదారుల కోసం మున్సిపల్ విచారణలు, ఆన్‌లైన్ ఫిర్యాదుదాఖలు, డిజిటల్ వనరుల ప్రయోజనాలు ఇతర అంశాలపై అవగా హన కల్పించారు. వినియోగదారులకు సమగ్ర న్యాయం జరిగేలా డిజిటల్ యాక్సెస్‌ను నిర్ధారించడంలో ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment