సాంకేతిక విద్యాభివృద్ధికి కృషి చేయాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పెద్దపల్లి పార్లమెంట్ ని యోజకవర్గ పరిధి లో సాంకేతిక విద్యాభివృద్ధికి కృషి చేయాలని టెక్నికల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు మంగళవారం వినతిపత్రం అందించారు. మంచిర్యాలలోని ఎంపీ ఇంటికి వెళ్లిన ప్రతినిధులు మంచిర్యాలలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని, ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని, బెల్లంపల్లి ప్ర భుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసి మైనింగ్ కోర్సు ప్రవేశ పెట్టాలని కోరారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2025–26 విద్యా సంవత్సరానికి నూతన కోర్సులు, నూతన కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్న నే పథ్యంలో తమ వినతిని సాంకేతిక విద్యామండలి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో టెక్నికల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్‌కుమార్, రాష్ట్ర నాయకుడు పూదరి శ్రీకాంత్‌పటేల్, నా యకులు మేకల మల్లికార్జున్, సామ మనోజ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment