ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ, పౌరసరఫరాల, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, సహకారశాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. జిల్లాలో రైతుబీమా పథకంలో అర్హులైన లబ్ధిదారుల కుటుంబా లకు అందించాల్సిన పరిహారం చెల్లింపులో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నామినీ కూడా మృతి చెందితే నిబంధన ప్రకారం సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించి పరిహారం చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
రబీ సాగుకు విత్తనాలు, ఎరువులు..
రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో సాగుకు అవసరమైన డీఏపీ, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. చెన్నూర్, జైపూర్ మండలాల పరిధిలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలన్నారు. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఏఈవోలు తమ ఫొటో, లైవ్ లోకేషన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మ్యాట్రిక్ ఆయిల్‌పామ్ సంస్థ ప్రతినిధి ఉదయ్‌కుమార్, డీఏవో కల్పన, ఉద్యానవన అధికారి అనిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.
వార్షిక రుణ లక్ష్యాలు సాధించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వార్షిక రుణ లక్ష్యాలను సాధించేలా బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో లీడ్ మేనేజర్ తిరుపతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం డెబోజిత్ బౌరా, యూనియన్ ఆఫ్ ఇండియా ఏజీఎం సురేశ్, నాబార్డ్ డీడీఎం అబ్దు ల్ రవూఫ్‌తో కలిసి రుణ లక్ష్యసాధనపై మంగళవారం సమీక్ష నిర్వహించా రు. సెప్టెంబర్ వరకు పంట రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు, విద్యా రుణాలు, మహిళా సంఘాలకు ఇచ్చిన రు ణాలపై చర్చించారు. టీజీబీ రీజినల్ మేనేజర్ మురళీధర్‌రావు, ఆదిలాబా ద్ రీజినల్ మేనేజర్ ప్రభుదార్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లాలో పారదర్శకంగా చేపట్టాలని, దరఖాస్తుదారుల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా యాప్‌లో నమోదు చేయాలనికలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జెడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వరావులతో కలిసి ఎంపీడీవోలతో సమీక్ష ఇర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు, జలశక్తి అభియాన్, ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులు, కోతులు, కుక్కల నివారణపై చరిచంచారు. ఇందిరమ్మ సర్వేలో సాంకేతిక సమస్యలు ఉంటే రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయలన్నారు. ఉపాధి పనులు గడువులోపు పూర్తి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment