విద్యుత్‌షాక్‌తో ఒకరు మృతి
ఖానాపూర్: విద్యుత్‌షాక్‌తో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు మస్కాపూర్ గ్రామానికి చెందిన ఒడ్నాల పెద్ద భీమన్న (64)కు గంగాయిపేట్‌లో వ్యవసాయ పంటపొలం ఉంది. అందులో కూరగాయలు సాగు చేశాడు. కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు జియా వైరుకు సోలార్ కనెక్షన్ ఇచ్చాడు. ఎప్పటిలాగే సోమవారం సైతం పంట చేనుకు వెళ్లగా జియా వైర్(ఇనుప తీగ)కు కాలుతగలడంతో షాక్‌కు గురై కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ సైదారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.
ఉరేసుకుని యువకుడు..
నేరడిగొండ: ఉరేసుకుని యు వకుడు ఆత్మహత్య చేసుకు న్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బుద్దికొండకు చెందిన సింగం లక్ష్మణ్ కుమారుడు సాయిచరణ్ (23) ఈనెల 25న తన స్నేహితుడి పుట్టినరోజు సంబరాలను ఊరుబయట ఉన్న పోచ మ్మ ఆలయం వద్ద జరుపుకోగా అక్కడ ఉన్న హై మాస్ లైట్లను యువకులు పగులగొట్టారు. దీంతో గ్రామ పెద్దలతో పాటు గ్రామఅభివృద్ధి కమిటీ స భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌సై శ్రీకాంత్ సదరు యువకులను పిలిపించి ప్రశ్నించారు. ఇ లాంటివి పునరావృతం కాకుండా ఉండాలని సూ చించారు. కాగా ఆదివారం రాత్రి సాయిచరణ్ బ యటకు వెళ్లివస్తానని చెప్పి గ్రామ శివారులో గల పంట పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. తన కుమారుడి మృతికి గ్రామస్తులే కారణమ ని, పోలీసు స్టేషన్‌కు పిలిపించడంతోనే ఆత్మహత్య కు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు, బంధువులు ర హదారిపై బైటాయించారు. మృతికి కారణమైన వా రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, ఇచ్చోడ సీఐ భీమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటా మని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నిమోనియాతో చిన్నారి..
ఇంద్రవెల్లి: నిమోనియాతో చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని హర్కపూర్ ఆంద్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కై లాస్‌నగర్‌కు చెందిన కుడే సంతోశ్, పూజ దంపతుల కుమార్తె సీతాల్ (రెండు నెలలు) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు మూడురోజుల క్రితం ఆదిలా బాద్‌లోని రిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించగా చిన్నారి నిమోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందించినా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment