నిర్మల్‌ఖిల్లా: అనునిత్యం గల్ఫ్‌దేశాల్లో వివిధ కారణాలతో జిల్లావాసుల మరణ మృదంగం కొనసాగుతున్నా.. ఉపాధి వలసలు మాత్రం ఆగడం లేదు. ఇదే కోవలో జిల్లాకు చెందిన ఒకరు నాలుగు నెలల క్రితం గల్ఫ్ దేశమైన దుబాయ్ వెళ్లాలని ముంబై చేరుకుని అక్కడ దారితప్పగా ఇప్పటికీ ఆచూకీ లభ్యం కానీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లికి చెందిన తంబాకు శ్రీనివాస్ (39) కుటుంబ పోషణ కోసం ఉన్న ఊరిలో అప్పుల పాలు కావడంతో ఉపాధికోసం దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గల్ఫ్ ఏజెంటును ఆశ్రయించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని సదరు ఏజెంటు రూ.75వేలు తీసుకొని ముంబైలోని ట్రావెల్ ఏజెన్సీ సర్వీసెస్ సహాయంతో ఆగస్టు 5న విమాన టికెట్ బుక్ చేశాడు. ఆగస్టు 3న ఆర్మూర్ నుంచి ముంబైకి బస్సులో బయలుదేరిన శ్రీనివాస్ 4న అక్కడికి చేరుకున్నట్టు భార్య
లక్ష్మికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఇప్పటి వరకు అతను ఎక్కడికి వెళ్లిందీ.. ఏం చేస్తున్నాడన్న సమాచారం లేదు. ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ వస్తుండడంతో సదరు ఏజెన్సీ ఏజెంట్‌ను పదేపదే అడుగగా బోర్డింగ్ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కకుండా ఉంటే తాము చేయగలిగిందేమీలేదని స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా సంప్రదించినట్లు పేర్కొన్నారు. తాజాగా సోమవారం శ్రీనివాస్ భార్య లక్ష్మి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పర్కిపండ్ల, కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారి కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తూ తన భర్త ఆచూకీ కనుగొనాలని వేడుకున్నారు. గత నాలుగు నెలలుగా తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
● ఉపాధి కోసం వెళ్లిన జిల్లావాసి అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment