సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గాదిగూడ మండలం సిద్వం గ్రామానికి చెందిన లక్ష్మీబాయి త్రిఫేస్, బోర్‌వెల్ మంజూరు చేయాలని, నార్నూర్ మండలానికి చెందిన కిరణ్ కుమార్ కారులోన్ ఇప్పించాలని, ఉట్నూర్ మండలం మారుతిగూడకు చెందిన రుక్మాబాయి బోరింగ్ రిపేర్ చేయించాలని కోరారు. ఇంకా వివిధ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. కార్యక్రమంలో ఏపీవో వసంత్‌రావు, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఐసీడీఎస్ ఉమాదేవి, డీపీవో ప్రవీణ్, మేనేజర్ లింగు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment