లేగదూడపై చిరుత దాడి
సారంగపూర్: మండలంలోని దుప్యాతండా అటవీ ప్రాంతంలో శుక్రవారం మేతకు వెళ్లిన లేగదూడపై చిరుత దాడి చేసి హతమార్చింది. డీఆర్వో నజీర్‌ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుప్యాతండాకు చెందిన జాదవ్ ప్రేమ్‌కుమార్ అనే రైతు తన ఆవులు, లేగదూడలను సమీప అటవీ ప్రాంతంలో మేతకు తరలించాడు. ఈక్రమంలో చిరుతపులి ఆవుల మందపై దాడిచేసి లేగదూడను హతమార్చింది. గమనించిన పశువుల కాపరులు కేకలు వేయడంతో అక్కడినుంచి చిరుతపులి పారిపోయింది. అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో డీఆర్వో నజీర్‌ఖాన్, ఎఫ్‌బీవోలు వెన్నెల, సుజాత ఘటనాస్థలానికి చేరుకున్నారు. లేగదూడ కళేబరాన్ని పరిశీలించి చిరుత పాదముద్రలు గుర్తించారు. అనంతరం సమీప పంటపొలాల్లో ఉన్న రైతులు, అటవీ ప్రాంతంలోని గ్రామాల ప్రజలను చిరుత సంచారంపై అప్రమత్తం చేశారు. చిరుతకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, కంటపడితే సమాచారం ఇవ్వాలని సూచించారు. మృతి చెందిన లేగదూడ యజమానికి పరిహారం అందేలా చూస్తామని తెలిపారు.
జీపు డ్రైవర్‌పై కేసు
ఆదిలాబాద్‌రూరల్: పరిమితికి మించి వాహనంలో ప్రయాణికులను తరలిస్తున్న జీపు డ్రైవర్ ఆజీజ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పలు రూ ట్లలో ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇందులో భాగంగా అనుకుంట సమీపంలో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. అజీజ్ అనే డ్రైవ ర్ పరిమితికి మించి ప్రయాణికులను జీపులో తరలిస్తుండగా పట్టుకున్నారు. జీపును సీజ్ చేసి అజీజ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
సారంగపూర్: మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన గాడి లక్ష్మి, గొడ్డు చిన్న అమ్మాయికి చెందిన రేకుల ఇళ్లు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైనట్లు ఆర్‌ఐ నర్సయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి, చిన్న అమ్మాయి వ్యవసాయ కూలీలు. శుక్రవారం ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లారు. గంట తర్వాత ఇంట్లోంచి పొగలు రాగా స్థానికులు గమనించారు. తాళం పగులగొట్టి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో నిత్యావసరాలు, దుస్తులు, కూలర్, టీవీ, ఫ్యాన్ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని ఆర్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment