రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ఇంద్రవెల్లి: మండలంలోని హీరపూర్ సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం కొల్లారి గ్రామానికి చెందిన ప్రభాకర్ ఆసిఫాబాద్ నుంచి గుడిహత్నూర్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామానికి చెందిన తండ్రీకొడుకు రాంచంద్రారెడ్డి, నితేశ్‌రెడ్డి మరో ద్విచక్రవాహనంపై ఇంద్రవెల్లి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో హీరపూర్ సమీపంలో ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వీరి ద్విచక్రవాహనలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోరిగాం గ్రామానికి చెందిన రాంచందర్‌రెడ్డి కాలు విరిగింది. అతని కొడుకు నితేశ్‌రెడ్డి, కొల్లారి గ్రామానికి చెందిన ప్రభాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే వీరిని చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment