సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జైనథ్ మండలం పార్డి(బీ), పార్డి(కే), రామాయి గ్రామాల్లో శనగ, మొక్కజొన్న, జొన్న, కంది పంటల్లో శుక్రవారం క్షేత్ర సందర్శన నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్తలు కే రాజశేఖర్, డాక్టర్ డీ మోహన్‌దాస్, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు జీ ప్రవీణ్‌కుమార్, డాక్టర్ జీ అనిల్‌కుమార్ రైతులతో కలిసి ఆయా పంటల సాగుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనగపంటలో లద్దె పురుగు పచ్చపురుగులను నివారించేందుకు ఎమమొక్టిన్ చెంజోయట్ ప్లస్ నోవల్యురన్‌ను ఎకరానికి 330 మిల్లిలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న, జొన్న పంటల్లో కత్తెర పురుగు నివారణకు 3కేజీల కార్బొ ప్యూరాన్ గుళికలు, నాలుగు లింగాకర్షక బుట్టలు, రాత్రిపూట మంటలను వెలిగించాలని తెలిపారు. లామ్టాసైషలోథ్రిన్ ప్లస్, క్లోరంధని లిప్పోల్ 80మిల్లీ లీటర్లు స్పైనిటోరం 180 మిల్లీ లీటర్ల సుడుల్లో పడేలా పిచికారీ చేయాలని వారు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment