నాగోబా జాతర తైబజార్ వేలం
ఇంద్రవెల్లి: ఈ నెల 28వ తేదీన మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభించనున్న నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం దర్బార్ హాల్‌లో దేవాదా య, రెవెన్యూ శాఖల అధికారులు, మెస్రం వంశీయులు వేలం నిర్వహించారు. తైబజార్ నిర్వహణను రూ.7.26 లక్షలకు కేంద్రే అవదూత్ దక్కించుకున్నారు. జాతరలోని దుకాణా సముదాయాలతో పాటు ఆలయానికి విద్యుత్ సరఫరా బాధ్యతలను రూ.2.01లక్షలకు మరొకరు సొంతం చేసుకున్నారు. ప్యాలాలు, పుట్నాల అమ్మకపు బాధ్యతల ద్వారా రూ.50 వేలు, కొబ్బరి ముక్కల సేకరణ కాంట్రాక్ట్ ద్వారా రూ.2లక్షల ఆదాయం సమకూరింది. ఈసారి వేలం ద్వారా రూ.9.97లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా వాహనాల పార్కింగ్, కొబ్బరి కాయల దుకాణాల ఏర్పాటుకు వేలం నిర్వహించాల్సి ఉందని దేవాదాయశాఖ ఈవో రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, గ్రామస్తులు మెస్రం నాగ్‌నాథ్, తోడసం సాగర్, మెస్రం ఆనంద్‌రావ్, షేక్‌నాథ్, దేవాదాయశాఖ అధికారి రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment