● పట్టభద్రులకు 2, ఉపాధ్యాయ స్థానానికి ఒకటి ● 12కు చేరిన నామినేషన్ల సంఖ్య
కరీంనగర్ అర్బన్: కరీంనగర్–మెదక్–నిజామాబా ద్–ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం పట్టభద్రుల స్థానానికి ఇద్దరు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నా మినేషన్ పత్రాలను కలెక్టర్ పమేలా సత్పతికి అందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగలధర్మారం గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన పిడిశెట్టి రాజు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. ఉపాధ్యాయుల ఎ మ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఇన్నారెడ్డి తిరుమల్‌రెడ్డి నామినేషన్ వేశారు. రెండ్రోజుల్లో 8 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, నలు గురు టీచర్ స్థానానికి నామినేషన్ వేశారు. గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు కలిపి మొత్తం 12మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment