![ఆశ్రమ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04knp180-340038_mr-1738697677-0.jpg.webp?itok=icXBJQcq)
ఆశ్రమ పాఠశాలల తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలను మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాలలను వేర్వేరుగా తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యసన సామర్థ్యాలతో పాటు పదో తరగతి విద్యార్థుల వందరోజుల ప్రణాళిక అమలు తీరు తెలుసుకున్నారు. పీవో ప్రత్యేకంగా రూపొందించిన యంగ్ ఓరియేటెడ్ క్లబ్ కార్యక్రమంతో పాటు స్కిట్స్ రోల్ ప్లే యాక్టివిటీస్ గురించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చదువులో విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో ఉపాధ్యాయులను అభినందించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించి స్కిట్స్‌ను పరిశీలించారు. పాఠశాలల పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు. విధిగా మెనూ పాటించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో హెచ్‌ఎంలు ఎంఏ గఫార్, కాంతారావు, వార్డెన్లు బలిరాం, గోవింద్ తదితరులున్నారు.
తిరుపతికి వెళ్లి
తిరిగి రాని లోకాలకు..
నేరడిగొండ: మండలంలోని రేంగన్‌వాడి గ్రామానికి చెందిన సిడాం చిత్రు (57) దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లి ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి మృతి చెందాడు. వివరాలు.. సిడాం చిత్రు, విఠల్ రైలులో ఇటీవల దైవదర్శనానికి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందాడు. విఠల్ ఒక్కడే స్వగ్రామానికి చేరుకున్నాడు. చిత్రు విషయమై ఆయన కుటుంబీకులు విఠల్‌ను ప్రశ్నించగా తప్పిపోయినట్లు సమాధానం ఇచ్చాడు. దీంతో వారు హైదరాబాద్‌లో పోలీసులను ఆశ్రయించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై పడి మృతిచెందగా, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో ఉంచినట్లు వారు తెలిపారు. అనంతరం కుటుంబీకులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి భార్య ద్రుపది, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. దైవదర్శనానికి వెళ్లిన ఆయన మృతదేహంగా రావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మంగళవారం రాత్రి గ్రామంలో చిత్రు అంత్యక్రియలు నిర్వహించారు.
![ఆశ్రమ పాఠశాలల తనిఖీ
1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04bod80-340094_mr-1738697677-1.jpg)
ఆశ్రమ పాఠశాలల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment