![వరుస చోరీల నిందితుడి అరెస్ట్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04mdl201-340127_mr-1738697679-0.jpg.webp?itok=JnsW3hZ6)
వరుస చోరీల నిందితుడి అరెస్ట్
భైంసాటౌన్: పట్టణంలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌కు చెందిన విజయ్ సింధే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బలరాంపూర్‌లో ఉంటున్నాడు. అతడు జల్సాలకు అలవాటు పడి భైంసాలోని నర్సింహాలయం, పులేనగర్ హనుమాన్ ఆలయం, కై లాస్ జిన్నింగ్‌లోని బాలాజీ ఆలయం, సంతోషీమాత ఆలయంతోపాటు ఓ వైన్స్‌లో చోరీకి పాల్పడ్డాడు. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి 3.150 కిలోల వెండి, మూడు మాసాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ గోపీనాథ్, ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, పీీసీలు ప్రమోద్, హరిబాబు, అంబదాస్, సుభాష్, శివరాజ్, శరత్ చంద్ర, డబ్ల్యూపీసీలు అనిత, సంగీత, హోంగార్డ్ గంగారావ్‌ను అభినందించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ అవినాష్ కుమార్, ఎస్సై మహమ్మద్ గౌస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment