![‘కొత్త గనులను విస్మరించిన కేంద్రం’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04mcl126-340088_mr-1738697678-0.jpg.webp?itok=MynEwn7l)
‘కొత్త గనులను విస్మరించిన కేంద్రం’
శ్రీరాంపూర్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటును పూర్తిగా విస్మరించిందని ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జట్టి శంకర్‌రావు ఆరోపించారు. మంగళవారం ఆయన ఆర్కే 5 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో బొగ్గు పరిశ్రమకు ఊతమిచ్చే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులకు పెర్క్స్‌పై ఆదాయపన్ను రద్దు కోసం తమ యూనియన్ సెక్రటరీ జనరల్ బీ జనక్‌ప్రసాద్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని తెలిపారు. గనుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, క్యాంటీన్‌లో మెనూను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గనిలో ఉత్తమ ఉద్యోగిగా ఎంపికై గణతంత్ర వేడుకల్లో బహుమతి పొందిన ఎస్‌డీఎల్ ఆపరేటర్ శ్రీనివాసులును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు కలవేన శ్యామ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు గరిగే స్వామి, పేరం రమేశ్, కేంద్ర కార్యదర్శి పిన్నింటి మల్లారెడ్డి, నాయకులు మహేందర్‌రెడ్డి, చంద్రమోహన్, రాంగిశెట్టి శ్రీనివాస్ నంబయ్య, భీమ్ రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment