![ఉత్సా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04adi434-604886_mr-1738697678-0.jpg.webp?itok=6SY7UPeZ)
ఉత్సాహంగా అంతర్‌జిల్లాల కబడ్డీ పోటీలు
ఆదిలాబాద్: రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 71వ అంతర్ జిల్లాల కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోటీలను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉష్కం రఘుపతి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా స్వీకరించాలని సూచించారు. అ నంతరం సింథటిక్ కోర్టులపై ఖమ్మం–హైదరాబా ద్, ములుగు–సూర్యపేట జిల్లాల మధ్య పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, పీడీ హరిచరణ్, విఠల్‌రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
![ఉత్సాహంగా అంతర్‌జిల్లాల కబడ్డీ పోటీలు1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04adi435-604886_mr-1738697678-1.jpg)
ఉత్సాహంగా అంతర్‌జిల్లాల కబడ్డీ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment