రేషన్ బియ్యం పట్టివేత
దండేపల్లి: ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు మండల కేంద్రంలోని రెండు కిరాణాషాపుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ అంజన్న, ఆర్‌ఐ భూమన్న మంగళవారం తనిఖీలు నిర్వహించినట్లు తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు. శ్రీనివాస్ కిరాణాదుకాణంలో వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచిన రెండున్నర క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. దుకాణాయజమానిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన బియ్యాన్ని దండేపల్లిలోని షాప్ నంబర్–14లో అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఒకరి మృతికి కారకుడైన
కారు డ్రైవర్‌కు జైలు
రెబ్బెన: ఒకరి మృతికి కారకుడైన కారు డ్రైవర్‌కు ఆరునెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ అడిషనల్ జేఎఫ్‌సీఎం జక్కుల అనంతలక్ష్మి తీర్పునిచ్చారు. రెబ్బెన సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన జంజిరాల తిరుపతి (42), అతడి భార్య, పిల్లలతో కలిసి 2020, డిసెంబర్ 20న కాగజ్‌నగర్‌లోని ఈస్‌గాంకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నారు. రెబ్బెన మండలం వంకులం స మీపంలో ఎదురుగా కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వైపు నుంచి వస్తున్న కారును డ్రైవర్ అతివే గం, అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా తి రుపతి నడుపుకొంటూ వస్తున్న బైక్‌ను ఢీకొ ట్టాడు. ఈ ప్రమాదంలో తిరుపతి, అతడి భార్య, పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. తిరుపతిని మెరుగైన వైద్యం కోసం ముందుగా మంచిర్యాలకు తరలించగా చికిత్స అందించారు. పరిస్థితి విషమించగా మరుసటి రోజు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే తిరుపతి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి కమల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ప్రస్తుత సీఐ, ఎస్సై, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిశా, లైజన్ అధికారి రాంసింగ్, కోర్టు కానిస్టేబుల్ ఉమేశ్ సాక్షులను హాజరుపర్చారు. జడ్జి వారిని విచారించి నేరం రుజువు కావడంతో కారు డ్రైవర్ ఎండీ జాకీర్ హుస్సేన్‌కు పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైన డ్రైవర్‌కు శిక్షపడేలా కృషి చేసిన డీఎస్పీ చిత్తరంజన్, సీఐ, ఎస్సైని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.
ముగ్గురిపై అట్రాసిటీ కేసు
దహెగాం: మండలంలోని బొర్లకుంట గ్రా మానికి చెందిన లొనారె సత్యనారాయణ, అతడి కుమారులు సాయి, ప్రసాద్‌పై అట్రా సిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. ఈనెల 2న పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన డొంగ్రె తిరుపతిపై సత్యనారాయణ, అతడి ఇద్దరు కుమారులు గొడ్డలి కామతో దాడి చేశారు. అడ్డుగా వచ్చి ఆపే ప్రయత్నం చేసిన అతడి భార్య హేమలతను కూడా గాయపరిచి చంపుతామని బెదించారు. తిరుపతి ఫిర్యాదు మేరకు మంగళవారం ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment