![‘చెత్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04mdl03-340031_mr-1738697676-0.jpg.webp?itok=c2_pi5tQ)
‘చెత్త’శుద్ధి ఎలా?
భైంసా: బాసరలో పారిశుధ్యం లోపించింది. ఇక్కడి శ్రీజ్ఞానసరస్వతీ ఆలయంలో మూడురోజులుగా నిర్వహించిన వసంత పంచమి వేడుకల అనంతరం ఈ పరిస్థితి తలెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి 1.20లక్షల మంది భక్తులు రాగా, సరిపడా ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్ కలుగజేసుకుని పార్టీ శ్రేణులతో కలిసి శ్రమదానంతో స్నానఘట్టాలతోపాటు ఇతర ప్రాంతాలను శుభ్రం చేయించారు. ఇపుడు ఉత్సవా లు ముగిశాక ఎటు చూసినా అంతా అపరిశుభ్రమే. ఆలయ అధికారులు పారిశుధ్య నిర్వహణను విస్మరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని మార్గాల్లో అంతే..
బాసర రైల్వేస్టేషన్, బస్టాండ్, ప్రధాన రోడ్లు, ఆలయ ప్రాంగణం, పార్కింగ్ స్థలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పడి ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పదేపదే చెప్పే అధికారులు ఉత్సవాల్లో భక్తులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. పైగా, దుకాణాదారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగించినా చర్యలు తీసుకోలేదు. ఆలయ సిబ్బందే ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. పూజాద్రవ్యాలను కూడా ప్లాస్టిక్‌లోనే విక్రయిస్తున్నా పట్టింపు కరువైందని భక్తులు ఆరోపిస్తున్నారు.
నదీ జలం కలుషితం
ఇప్పటికీ స్నానఘట్టాల వద్దే పూజాద్రవ్యాలు, ఇతర వ్యర్థాలు కనిపిస్తున్నాయి. ఆలయ సిబ్బంది వీటిని తొలగించడంలో విఫలమయ్యారు. గోదావరి నది లో నీటి కాలుష్యం జరగకుండా ఎప్పటికప్పుడు క్లో రినేషన్ చేయాల్సి ఉండగా దీనినీ విస్మరించారు. కేంద్ర జలవనరుల సంఘం గతంలోనే రాష్ట్ర పరి ధిలో గోదావరి నదీ జలాలు కలుషితమవుతున్న ప రిస్థితిపై నమూనాలు సేకరించిన విషయం తెలిసిందే. నది నీటిని కలుషితం కాకుండా చూడాలని అ ప్పట్లోనే అధికారులు ఆదేశించారు. అయినా ఆల య అధికారుల్లో స్పందన లేదు. పక్కనే ట్రిపుల్ ఐ టీ కళాశాల ఉండగా ఇందులో చదువుకునే ఏడువే ల మంది విద్యార్థులకు తాగునీటిని అందించే చెరువుకు గోదావరినది నుంచే నీటిని తరలిస్తారు. ఇక్క డి గోదావరి నది నుంచే నిజామాబాద్, నిర్మల్, ఆది లాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ని అందిస్తున్నారు. ఎంతోమందికి తాగునీరు అందించే గోదావరి నదీ జలాలు కలుషితం కావడాన్ని అధికారులు అరికట్టడంలేదు. వీరు తీరుపై భక్తులతోపాటు స్థానికులూ అసహనం వ్యక్తంజేస్తున్నారు.
బాసరలో అంతా అపరిశుభ్రం
పేరుకుపోయిన చెత్తాచెదారం
![‘చెత్త’శుద్ధి ఎలా?1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04mdl05-340031_mr-1738697676-1.jpg)
‘చెత్త’శుద్ధి ఎలా?
Comments
Please login to add a commentAdd a comment