లెక్కతేలింది..
మంచిర్యాలఅర్బన్: జాతీయ విద్యావిధానం ప్రకా రం బడీడు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో విద్యనభ్యసించాలనే లక్ష్యంతో నిర్వహించిన సర్వే ముగిసింది. ఇంతవరకు బడికి వెళ్లని పిల్లలు ఎంతమంది ఉన్నా రు..? మధ్యలో బడి మానేయడానికి, ఇప్పటివరకు బడిలో చేరకపోవడానికి కారణాలు ఏమిటనేది వెల్ల డైంది. బడికి రాలేని పిల్లలు గ్రామాల్లో ఎంతమంది ఉన్నారనే విషయాలపై లెక్క తేలింది. 6నుంచి 14 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలతోపాటు 15నుంచి 19 ఏళ్లలోపు బడి బయట పిల్లలపై సర్వే సాగింది. జనవరి 16నుంచి 31వరకు సర్వే నిర్వహించారు. 18 మండలాల్లో 41మంది సీఆర్పీలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. జిల్లాలో 264మందిని బడిబయట పిల్లలుగా గుర్తించారు.
ఇంటింటికీ వెళ్లి..
బడి మానేసిన పిల్లలు, వలస కార్మికుల విద్యార్థుల వివరాలను సీఆర్‌పీ, ఐఈఆర్‌పీలతో సేకరించారు. జిల్లాలోని 18మండలాల్లో 51 క్లస్టర్లలో 41మంది సీ ఆర్పీలు వివరాల సేకరణలో పాల్గొన్నారు. బడికి వె ళ్లని విద్యార్థి పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు, ఆధార్ సంఖ్యతోపాటు పాఠశాలకు ఎందుకు రావ డం లేదో తదితర అంశాలతో కూడిన వివరాల సేకరణ జరిగింది. బడిలో ప్రవేశం పొందినప్పుడు ఆ ధార్ నంబరుతో అనుసంధానం ఆధారంగా బాలలను గుర్తించేందుకు సర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గ్రామాలు, మున్సిపాల్టీల్లో పర్యటించి వివరాల సేకరణ పూర్తి చేశారు. 15నుంచి 19ఏళ్లలోపు పిల్లలు 113మంది, 6నుంచి 14ఏళ్లలోపు పిల్ల లు 151మందిని గుర్తించారు. బడిబయట బాలల వివరాలను ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేసి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్నారు.
ఎందుకిలా..?
జిల్లాలో చాలామంది పిల్లలు బట్టీలు, చెత్త ఏరుతూ కనిపిస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి న కార్మికుల పిల్లలతోపాటు జిల్లాకు చెందిన ఇటుకబట్టీ కార్మికులు, ఊరి బయట పంట పొలాల్లో కూలీలుగా పని చేస్తుంటారు. వారి పిల్లలు కూడా అక్కడే ఉంటూ పనుల్లో మునిగితేలడం సర్వసాధారణంగా మారింది. 15నుంచి 19ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలు వ్యవసాయ, ఇతర పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దీంతో బడికి రావడం కంటే పనులవైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
ఫీజులు చెల్లిస్తూ..
సీఆర్పీలు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారు. గతేడాది 6నుంచి 14 ఏళ్లలోపు 102 మంది బడిబ యట పిల్లలను గుర్తించి 86 మందిని సమీప పాఠశాలల్లో చేర్పించారు. 15నుంచి 19ఏళ్లు కలిగి బడికి దూరంగా 135 మంది పిల్లలు ఉన్నట్లు లెక్క తేల్చా రు. వీరిలో 102మందిని ఓపెన్ పది, ఇంటర్‌లో చే ర్పించారు. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తోంది. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తూ పిల్లలను చదువుల వైపు మళ్లించారు. ప్రస్తుతం 264 మందిని గుర్తించినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. సర్వేతో బడిబయ ట విద్యార్థుల గుర్తింపునకు వీలు కలిగిందని అన్నా రు. వారిని పాఠశాలలు, ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో చదివించడానికి అవసరమయ్యే బడ్జెట్ కేటాయింపునకు సర్వే దోహదం చేస్తుందని తెలిపారు.
మండలం 6–14 15–19 మొత్తం
బెల్లంపల్లి 8 12 20
భీమారం – 1 1
భీమిని 20 1 21
చెన్నూర్ 30 2 32
దండేపల్లి 16 13 29
హాజీపూర్ 4 – 4
జన్నారం 4 23 27
కన్నెపల్లి 11 14 25
కోటపల్లి 19 6 25
లక్షెట్టిపేట 14 21 35
మందమర్రి 6 9 15
నెన్నెల 15 6 21
వేమనపల్లి 3 1 4
మొత్తం 151 113 264
ఆన్‌లైన్‌లో నమోదు
బడి బయట పిల్లలను గుర్తించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. బడి బయట పిల్ల లు లేకుండా చేయాలన్నదే సర్వే ఉద్దేశం. సీఆర్‌పీలు గ్రామాల్లో పర్యటించి బడిమానేసిన, వెళ్లలేని పిల్లల వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం పాఠశాలల్లో చేర్పిస్తాం.
– సత్యనారాయణమూర్తి,
సెక్టోరల్ అధికారి, మంచిర్యాల
బడిబయట బాలలు 264మంది
పాఠశాలల్లో చేర్పించనున్న అధికారులు
వయస్సుల వారీగా విద్యార్థుల వివరాలు
Comments
Please login to add a commentAdd a comment