![గూడెంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mcl152-340066_mr-1738869971-0.jpg.webp?itok=wOZWcpd6)
గూడెంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దండేపల్లి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవా లు గురువారం అత్యంత వైభవోపేతంగా ప్రా రంభం అయ్యాయి. గుట్ట కింది నుంచి సన్నా యి వాయిద్యాలతో పూజా సామగ్రి, స్వామి వారి చిత్రపటంతో గుట్టపైకి వెళ్లారు. ఆలయం ముందు మండపం వద్ద సప్తాహ భజనలు ప్రారంభించారు. అనంతరం నిత్యవిధి, ప్రాభో ధిక ఆరగింపు, తీర్థప్రసాద గోష్టి, విశ్వక్సేనారా ధన, దీక్ష కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు రఘుస్వామి, సంపత్‌స్వామి, వేదపారాయణదారు నారాయణశర్మ, అర్చకులు సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment