● మండిపోతున్న ఎండలు ● పగటి వేళ తగ్గిన జనసంచారం
జిల్లాలో గురువారం నమోదైన గరిష్ట
ఉష్ణోగ్రత(డిగ్రీలు సెల్సియస్) వివరాలు
మండలం గ్రామం ఉష్ణోగ్రతలు
భీమారం భీమారం 37.5
జన్నారం తపాలపూర్ 37.5
దండేపల్లి లింగాపూర్ 37.4
భీమిని భీమిని 37.4
నెన్నెల నెన్నెల 37.4
నస్పూర్ నస్పూర్ 37.4
కోటపల్లి దేవులవాడ 37.3
చెన్నూర్ కొమ్మెర 37.3
బెల్లంపల్లి బెల్లంపల్లి 37.2
జైపూర్ కుందారం 37.1
బెల్లంపల్లి/దండేపల్లి: జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు దడ పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గురువారం జిల్లాలోని పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 37డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది. ఆదిలోనే ఎండలు దంచికొడుతుండడంతో మున్ముందు మరెంత తీవ్రంగా ఉంటాయోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. బొగ్గు గనులు కలిగి ఉన్న బెల్లంపల్లి, తాండూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ పారిశ్రామిక ప్రాంతాల్లో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఎండవేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ఉదయం కొంత చలి.. పగటివేళ ఎండ తీవ్రత.. రాత్రివేళ కొంత చలితో భిన్న వాతావరణం ఉంటోంది. సాధారణంగా యేటా ఫిబ్రవరి మొదటి వారంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే ఈసారి 3నుంచి 4డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
తగ్గుతున్న జన సంచారం
ఎండల తీవ్రత కారణంగా మధ్యాహ్న సమయంలో రోడ్లపై జనసంచారం తగ్గుతోంది. అత్యవసర పనుల కోసం తప్ప సాధ్యమైనంత వరకు బయటకు రావడానికి సాహసించడం లేదు. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండల తీవ్రత తగ్గడం లేదు. మరో నాలుగు రోజులు కూడా ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మార్కెట్‌ను ముంచెత్తిన పుచ్చకాయలు
ఎండల తీవ్రత పెరుగుండడంతో చల్లదనాన్ని అందించే పుచ్చకాయలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వేసవి తాపాన్ని తీర్చడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి లారీలు, వాన్లలో దిగుమతి అవుతున్నాయి. జిల్లా కేంద్రం మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, చెన్నూర్, లక్సెట్టిపేట, జైపూర్, దండేపల్లి, జన్నారం, తాండూర్ తదితర ప్రాంతాలకు వ్యాపారులు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. చెరుకు, ఇతర శీతలపానీయాల దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. ఉక్కపోత ప్రారంభం కావడంతో ఇళ్లలో కూలర్లను ఏర్పాటు చేసుకునే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. కూలర్ల విక్రయాలను వ్యాపారులు ముమ్మరం చేశారు.
ఇంకెంత తీవ్రంగా ఉంటాయో..
ఎండకాలం వచ్చుడుతోనే భగ్గుమంటున్నది. ఉదయం 10 గంటలు దాటడంతోనే ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నది. సాయంత్రం 5 గంటల దాక అట్లనే ఉంటుండడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి భయమేస్తున్నది. ఇప్పుడే ఎండలను భరించలేక పోతున్నాం. వచ్చే మూడు నెలలు ఇంకెంతగా ఎండలు దంచికొడతాయో తలుచుకుంటేనే భయమేస్తున్నది.
– నడిగొట్టు కుమార్, బెల్లంపల్లి
● మండిపోతున్న ఎండలు ● పగటి వేళ తగ్గిన జనసంచారం
● మండిపోతున్న ఎండలు ● పగటి వేళ తగ్గిన జనసంచారం
Comments
Please login to add a commentAdd a comment