7 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
మెదక్ కలెక్టరేట్: ఈనెల 7వ తేదీ నుంచి జిల్లాలో విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్స రం విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 7న పాఠశాలస్థాయి, 21న మండల, 28న జిల్లాస్థాయి సంబరాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్‌రావు, దేవులా, ఏఎంఓ సుదర్శన్‌మూర్తి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రైతు రుణమాఫీ ఎప్పుడూ?
కౌడిపల్లి(నర్సాపూర్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం మహమ్మద్‌నగర్ సొసైటీ ప్రారంభోత్సవం అనంతరం విలేకరులతో మాట్లాడారు. రేషన్‌కార్డు లేనివారి జాబితా తయారు చేసినా ఇప్పటివరకు మాఫీ చేయకపోవడం సరికాదన్నారు. అలాగే రూ. 2 లక్షల పైన ఉన్న రైతులకు సైతం త్వరగా మాఫీ చేయాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లు త్వరగా ప్రారంభించాలన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బి ల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు సొంత ఖర్చులతో పనులు చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
తూప్రాన్: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని మల్కాపూర్‌లో కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయంలో కేసీఆర్ అన్నివర్గాలకు న్యాయం చేశారని తెలిపారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీసీఐ కేంద్రాల్లోనే
పత్తిని విక్రయించాలి
టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రైతులు పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి అన్నారు. సోమ వారం మండల పరిధిలోని ఆత్మకూర్ రోడ్డులో గల వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించిందని తెలిపారు. మద్దతు ధర క్వింటాలు రూ.7,521కు కొనుగోలు చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment