పేదలకు మెరుగైన వైద్యం
నర్సాపూర్: పేదలకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఐదు పడకలతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆస్పత్రిలో త్వరలో ఎన్‌సీడీ సెంటర్, ఎన్‌ఐసీయూ సెంటర్లు, ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డు ఏర్పాటు చేసేందుకు భూమి అందుబాటులో ఉందా..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆస్పత్రి పక్కన భూమి ఉందని చెప్పారు. ఆ భూమిని పరిశీలించి ఆస్పత్రికి కేటాయించాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శివదయాల్, డీఎంహెచ్‌ఓ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన, సూపరింటెండెంట్ డాక్టర్ పావని, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పీఏసీఎస్ భవనం ప్రారంభం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని మహమ్మద్‌నగర్ గేట్ వద్ద నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ కార్యాలయ భవనాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి షిఫ్టింగ్ పద్ధతిలో తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని.. వద్దని కోరుతూ విద్యార్థులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
మెదక్‌జోన్: సమాజాన్ని విద్యాపరంగా చైతన్య పర్చడంలో గ్రంథాలయాల పాత్ర కీలకమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రైస్ మిల్లర్లు అండర్ టేకింగ్ త్వరితగతిన పూర్తిచేసి ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో దిగుమతి సాధ్యం కాదని, బయటి జిల్లాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ పాల్గొనారు.
గ్రంథాలయాల పాత్ర కీలకం
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment