పెండింగ్ కేసులను ఛేదించాలి
– ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తమ పరిధిలోని గ్రామాలను పోలీస్ అధికారులు సందర్శించాలని తెలిపారు. తరచుగా తగాదాలు, నేరాలకు పాల్పడేవారిపై నిఘా ఉంచాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. లాంగ్ పెండింగ్, గుర్తుతెలియని మృతదేహాల కేసులను త్వరగా ఛేదించాలన్నారు. అవసరమైతే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సైబర్ క్రైం డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment