రైతు బీమా డబ్బులు కాజేసిన మహిళ అరెస్ట్
హవేళిఘణాపూర్(మెదక్): భర్త బతికి ఉండగానే చనిపోయాడని ధ్రువపత్రాలు సృష్టించి రైతు బీమా డబ్బులు డ్రా చేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు హవేళిఘణాపూర్ ఎస్‌ఐ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బూర్గుపల్లి క్లస్టర్ ఏఈఓ స్వాతి పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా తయారు చేస్తున్న క్రమంలో మృతిచెందిన వారి పేర్లు తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఈక్రమంలో లెంక మల్లేశం మృతి చెందినట్లు తెలపగా గ్రామస్తులు అతడు బతికే ఉన్నాడని తెలిపారు. ఈ విషయంపై ఆరా తీసిన ఏఈఓ వెంటనే హవేళిఘణాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మల్లేశం భార్య పద్మ అక్రమంగా రైతు బీమా డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఈమేరకు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment