గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌జోన్: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22వ తేదీన కొల్చారం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, మెదక్ చర్చిని సందర్శిస్తారని తెలిపారు. గవర్నర్ రాక మొదలు బయలుదేరే వరకు షెడ్యూ ల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు కొల్చారం మండల కేంద్రంలో గల పాఠశాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆయన వెంట నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, కొల్చారం తహసీల్దార్ గఫర్‌మియా, ఇతర అధికారులు ఉన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. దివ్యాంగులకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఎలాంటి అనారోగ్య సమస్యలైన పరిష్కరించాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment