మల్లన్న కల్యాణానికి ఏర్పాట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి కల్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ అనురాధ, వివిధ శాఖల అధికారులతో కలిసి స్వామివారి కల్యాణం జరిగే తోటబావి, వీఐపీ దర్శనం, వీఐపీ పార్కింగ్, ఎల్లమ్మ ఆలయం, క్యూకాంప్లెక్స్, తదితర పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వామివారి కల్యాణం ఈనెల 29న జరగనుండటంతో ఏర్పాట్లను వేగిరం చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాదారులు తమ సామగ్రిని రోడ్డుపై ఉంచకుండా చూడాలన్నారు. భక్తులకు వైద్యసేవలు అందించాలని తాత్కాలికంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులను సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ.. స్వామి వారి కల్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment