మా సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం 11వ రోజుకు చేరుకోగా కలెక్టరేట్ ఎదుట బోనాలతో నిరసన తెలిపారు. అనంతరం హౌసింగ్ బోర్డులో గల గ్రామ దేవత నల్లపోచమ్మకు బోనాలు సమర్పించి తమను రెగ్యులరైజ్ చేసేలా చూడాలని వేడుకున్నారు. వీరికి పీఆర్టీయూ టీఎస్ ఎమెల్సీ అభ్యర్థి మహేందర్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ నాయకులు, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు సిబ్బది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment