అమిత్‌షానుబర్తరఫ్ చేయాలి
నర్సాపూర్: అమిత్‌షాను మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను విమర్శించడం దారుణమని అన్నారు. అలాగే చిల్డ్రన్స్ పా ర్కులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, దళిత సంఘాల నాయకులు భిక్షపతి, సంజీవ, నరేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం: డీడబ్ల్యూఓ హైమావతి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారిణి హైమావతి పిలుపునిచ్చారు. శుక్రవారం నషా ముక్త్ భారత్ అభియాన్‌పై కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అంగన్‌వాడీలు ప్రజలకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment